ADB: ఉట్నూర్ ITDA కార్యాలయంలో పనిచేస్తున్న 200 మంది డైలీ వైస్ పార్ట్ టైం కార్మికులను తొలగిస్తూ సర్కులేషన్ జారీ చేయడం ఏమాత్రం సరైనది కాదని CITU రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. సర్కులేషన్ తీసుకొని కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ITDA అధికారులను కోరారు. లేనిపక్షంలో ఆశ్రమ పాఠశాల, ఔట్సోర్సింగ్ కార్మికులతో కలిసి కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు.