RR: బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీ పేజ్-2, మెడికల్ అండ్ హెల్త్ కాలనీలో నిర్వహించిన మాన్ సూన్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీలలో సమస్యలను పరిష్కరించటంతో పాటు, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించేందుకు మాన్ సూన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.