AP: CM చంద్రబాబు పాలనలో కల్తీ రాజ్యమేలుతోందని మాజీ MP గోరంట్ల మాధవ్ అన్నారు. కల్తీ మద్యం ఏరులై పారుతోందని తెలిపారు. సామాన్య ప్రజలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వమే ఓ కల్తీ ప్రభుత్వమని విమర్శించారు. చంద్రబాబు డైరెక్టన్లోనే మద్యం తయారవుతోందని ఆరోపించారు. చంద్రబాబు అవినీతి, అక్రమాలపై ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు.