VKB: VKB మండలం మద్గుల్ చిట్టెంపల్లి గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని ఏడి డా. కే. వి. చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ టీకాల కార్యక్రమం నవంబర్ 14 వరకు కొనసాగుతుందని, మండలంలోని అన్ని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణటీకాలు తప్పక ఇప్పించాలన్నారు. ఒక్క పశువును కూడా మరవకుండా వ్యాక్సిన్ ఇవ్వాలని మండల పశు వైద్యాధికారిణికి తెలిపారు.