BDK: మణుగూరు – ఏటూరునాగారం ప్రధాన రహదారిపై బొగ్గు, ఇసుక లారీల రాకపోకల వల్ల దుమ్ము, ధూళి తీవ్రంగా వ్యాపిస్తోంది. దీంతో ద్విచక్ర వాహనదారులు, ప్రజలు ప్రయాణించడానికి భయపడుతున్నారు. ముఖ్యంగా బొగ్గు రవాణా వల్ల కళ్లు మండిపోతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దుమ్ము, ధూళి నివారణకు రోడ్డుపై నీళ్లు చల్లండి మహాప్రభో అంటూ ఇవాళ ప్రజలు అధికారులను వెేడుకుంటున్నారు.