SRD: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రావిణ్య సంబంధిత అధికారులకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ధాన్యం కొనుగోలు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. హమాలీల కొరత లేకుండా చూడాలని పేర్కొన్నారు.