AP: ఏపీ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు లేఖ రాసింది. పోలవరం – బనకచర్ల విషయంలో తెలంగాణ అభ్యంతరాలపై లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ అభ్యంతరాలపై స్పందించాలని కృష్ణా బోర్డు ఏపీని కోరింది. కాగా పోలవరం – బనకచర్ల నిర్మాణంలో అభ్యంతరాలు తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఇటీవల లేఖ రాసిన విషయం తెలిసిందే.