NLR: జిల్లా అల్లూరు వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. హైదరాబాదు నుంచి చెన్నై వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు.