AP: బాగా బరువు తగ్గిపోయావంటూ మంత్రి లోకేశ్‌పై PM మోదీ సరదా వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం పర్యటన సందర్భంగా కర్నూల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న PMకి గవర్నర్, CBN, పవన్‌తో పాటు లోకేశ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేశ్‌తో మాట్లాడిన PM ‘చివరిసారి చూసినప్పటికంటే చాలా బరువు తగ్గావు. త్వరలో మీ నాన్నలా అవవుతావు’ అని వ్యాఖ్యానించారు.