VKB: బూటకపు హామీలతో బీసీ సమాజాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేలా తమ హక్కుల కోసం బీసీ సంఘాల నాయకులంతా ముందుకు రావాలని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు గాదె మహిపాల్ ముదిరాజ్ కోరారు. ఈ నెల 18న బీసీ సంఘాలు తలపెట్టిన బంద్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. బీసీ సంఘాల బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.