NLR: చేజర్ల మండలం ఆదురుపల్లిలో పందుల బెడద రోజు రోజుకు పెరుగుతోంది. వీటి కారణంగా రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని పంచాయతీ సెక్రటరీ రఫీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై తిరుమలరావు పందుల పెంపకందారులను తీవ్రంగా హెచ్చరించారు. గురువారం పెంపకందారులు వెంటనే స్పందించి గ్రామంలోని పందులను పట్టుకొని గ్రామం బయటకు తరలించారు.