మహిళలు షిఫ్టుల్లో పనిచేస్తే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షిఫ్టుల కారణంగా హార్మోన్లు, జీవక్రియ దెబ్బతిని.. రుతుక్రమం, గర్భధారణపై దుష్ప్రభావం పడుతుంది. నిద్రకు అంతరాయం కలగడం వల్ల హృదయ రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది టైప్-2 డయాబెటిస్, ఊబకాయం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి ప్రమాదాలను పెంచుతుందని వారు సూచిస్తున్నారు.