E.G: గోకవరం స్థానిక పాత బస్టాండ్ సమీపంలో ఉన్న మహబూబ్ సుభాని దర్గాలో 46వ గ్రంథోత్సవ వేడుకలు బాబు, జహాన్ దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ సెంటర్ నుంచి ఆంజనేయస్వామి గుడి మీదగా విద్యుత్ సబ్ స్టేషన్ వరకు ఊరేగింపు నిర్వహించి, దర్గాలో వేంచేస్తున్న మహబూబ్ సుభానికి గంధాన్ని సమర్పించారు.