BPT: చెరుకుపల్లి మండలం గూడవల్లి గ్రామంలోని సాయిబాబా గుడిలో చోరీ జరిగింది. గుడిలోని హుండీ పగలగొట్టిన దుండగులు అందులోని పెద్ద నోట్లు మాత్రమే దొంగలించారు. చిల్లర మాత్రం గుడిలోనే పడవేసి వెళ్లిపోయారు. సుమారు రూ. 30వేల దొంగతనం జరిగినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. గురువారం తెల్లవారుజామున చోరీ జరిగినట్లు భావిస్తున్నారు. దీనిపై పోలీసులు ఫిర్యాదు చేశారు.