MBNR: పాలమూరు యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ సంస్థల అధినేత ఎం.ఎస్.ఎన్ రెడ్డికి మహబూబ్నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డి గురువారం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ సంస్థల ద్వారా వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సత్యనారాయణ రెడ్డి ఉపాధి కల్పిస్తున్నారన్నారు.