SRPT: మునగాల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో కార్యాలయంలో సగానికి పైగా సిబ్బంది విధులకు గైర్హాజరుగా ఉన్నట్లు కలెక్టర్ గమనించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్లక్ష్యానికి తావు ఇవ్వబోమని స్పష్టం చేసిన ఆయన, గైర్హాజరైన సిబ్బంది పై తక్షణ సస్పెన్షన్ విధించారు.