AP: ప్రధాని మోదీ ఉదయం కర్నూలు ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మోదీకి సీఎం చంద్రబాబు, పవన్, లోకేష్ స్వాగతం పలికారు. అయితే, మోదీ లోకేష్‌ను చూసి సరదా వ్యాఖ్యలు చేశారు. ‘గతసారి చూసినప్పటికంటే ఇప్పుడు చాలా బరువు తగ్గావు’ అని అన్నారు. అంతటితో ఆగకుండా ‘త్వరలోనే మీ నాన్నలా తయారవుతావు’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుతోపాటు అక్కడున్న నేతలు చిరునవ్వులు చిందించారు.