ప్రకాశం: కొత్తపట్నం బీచ్ వద్ద ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’ క్యాంపెయిన్లో భాగంగా భారీ సైకత శిల్పాన్ని బుధవారం ప్రదర్శించారు. కొత్తపట్నం పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో శిల్పాన్ని ప్రదర్శించగా రాష్ట్ర జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ సత్య ప్రకాశ్ కార్యక్రమంలో పాల్గొని సిబ్బందిని అభినందించారు. జీఎస్టీ రేటు నాలుగు స్లాబ్ల నుంచి రెండు స్లాబ్లకు తగ్గించడం జరిగిందన్నారు.