WNP: పెద్దమందడి మండలం దొడగుంటపల్లిలో సోలార్ పవర్ ప్లాంట్‌లో భారీ కొండ చిలువను స్నేక్ క్యాచర్ కృష్ణ సాగర్ ఈరోజు పట్టుకున్నారు. ఇంఛార్జ్ వసంతరావు, మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, టెక్నీషియన్ గాడ్స్ సహాయంతో దానిని పట్టుకున్నానని ఆయన తెలిపారు. ఇది రెండో కొండ చిలువ అని, సమాచారం ఇచ్చిన వెంటనే వచ్చినందుకు కృష్ణ సాగర్‌కు వసంతరావు కృతజ్ఞతలు తెలిపారు.