NLR: విక్రమ సింహపురి యూనివర్సిటీలోని పినాకిని పురుషుల హాస్టల్‌ను వీసీ అల్లం శ్రీనివాసరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల గదులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. వంటశాల పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. విద్యార్థులతో కలిసి వీసీ హాస్టల్లోనే భోజనం చేశారు. ఆయన వెంట హాస్టల్ వార్డెన్ అల్లం ఉదయ్ శంకర్, కోట నీలా మణికంఠ, తదితరులున్నారు.