AKP: జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుధవారం ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్తో కలిసి ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో పర్యటించారు. లక్క బొమ్మల కళాకారుల ఇళ్లకు వెళ్లి వారు తయారు చేసిన బొమ్మలను పరిశీలించారు. బొమ్మల తయారీలో ఉపయోగించే కర్ర, రంగులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కళాకారులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.