TPT: నాగలాపురం RTC బస్టాండ్ సమీపంలోని యూనియన్ బ్యాంకులో బుధవారం వేకువజామున దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. బ్యాంకు వెనుక వైపున ఉన్న సిమెంటు గోదాము షట్టర్లు తెరచి లోపల గోడకు కన్నం వేసి బ్యాంకులోకి ప్రవేశించారు. బ్యాంకులోని సీసీ కెమెరాలు, అలారం కనెక్షన్లు కట్ చేశారు. కాగా, ఈ ఘటనపై బ్యాంకు మేనేజర్ నాగ మునీంద్ర నాయక్ చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.