కోనసీమ: ఇటీవల కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం విజయవంతమైందని కలెక్టర్ మహేశ్ కుమార్ బుధవారం తెలిపారు. 150 మంది కొనుగోలుదారులు, అమ్మకందారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇరు వర్గాల మధ్య సత్సంబంధాలు పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడిందన్నారు.