SRD: జహీరాబాద్ పట్టణంలో బుధవారం డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమాన్ని జరుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే మాణిక్యరావు అబ్దుల్ కలాం చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అబ్దుల్ కలాం దేశానికి స్ఫూర్తిదాయకం అని MLA పేర్కొన్నారు. ఇందులో BRS సీనియర్ నాయకులు మునీరుద్దీన్, రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్, పార్టీ అధ్యక్షులు నారాయణ ఉన్నారు.