NTR: జగ్గయ్యపేట పట్టణం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మాజీ రాష్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు కలాం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. భారతదేశ రక్షణ రంగాన్ని అగ్రపథంలో నిలిపిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. కలాంను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు.