ASR: కొయ్యూరు మండలం చీడిపాలెం జంక్షన్ వద్ద మంప ఎస్సై కే.శంకరరావు ఆధ్వర్యంలో బుధవారం ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో గంజాయి నిర్మూలనే ధ్యేయంగా ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నట్టు ఎస్సై తెలిపారు. ప్రతి వాహనాన్ని నిలిపివేసి, క్షుణ్ణంగా తనిఖీ చేసి విడిచి పెట్టారు. ఎవరైనా గంజాయి రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.