CTR: చిత్తూరు పూల మార్కెట్ వద్ద జరిగిన అల్లర్లలో మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. 2017 చిత్తూరు పూల మార్కెట్ తరలింపును సీకే బాబు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు మరో 24 మందిపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ప్రాసిక్యూషన్ ఆధారాలు నిరూపించకపోవడంతో న్యాయస్థానం వీరిని నిర్దోషులుగా తేల్చింది.