AP: నా ఫోన్ చంద్రబాబు, లోకేష్‌కి ఇస్తానని.. జనార్దన్ రావుతో చాటింగ్ నిరూపిస్తే దేనికైనా సిద్ధమని మాజీ మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. తిరుమల, బెజవాడ దుర్గమ్మపై ప్రమాణానికి సిద్ధమని.. చంద్రబాబు కుటుంబం ప్రమాణం చేయడానికి వస్తారా? అని నిలదీశారు. తాను ఎక్కడికి పారిపోలేదని స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు వెతకాల్సిన అవసరం లేదన్నారు.