WG: బ్రిటిష్ ప్రభుత్వంతో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని తూట్లు పొడుస్తూ, కార్మిక ఉద్యోగ వర్గానికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని సీఐటీయూ డిమాండ్ చేసింది. నరసాపురం మీరా భవన్లో సీఐటీయూ పట్టణ 8వ మహాసభ జరిపినట్లు తెలిపారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ.. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.