ATP: సింగనమల పోలీస్ సర్కిల్ పరిధిలో టపాసుల విక్రయాలకు అనుమతి తప్పనిసరి తీసుకోవాలని సీఐ కౌలుట్లయ్య గురువారం మీడియాకు తెలిపారు. టపాసులు షాపులకు లైసెన్సులు పొందే నిర్వాహకులు వారికి కేటాయించిన మైదాన ప్రదేశాలలోనే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. షాపుల వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అవసరమైన సదుపాయాలను సమకూర్చుకోవాలన్నారు.