CTR: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన సదుం మండలంలో బుధవారం వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు.. కొత్తపల్లికి చెందిన విజయ పీలేరులోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది. మంగళవారం ఉదయం ఆసుపత్రికి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో మండల పరిధిలోని పీలేరు మార్గంలో వ్యవసాయ పొలాల దారి వద్ద మృతి చెంది ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.