NRML: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాలు.. చింతలబోరి గ్రామానికి చెందిన వడ్నాల కృష్ణ (41) పని నిమిత్తం లింబ గ్రామానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో చాత గ్రామశివారులో రోడ్డుపై వేసిన సోయా పంట పొట్టు వల్ల బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. అతడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.