KMM: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని సీపీఐ ఎంఎల్ (మాస్ లైన్) రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ప్రభుత్వాన్ని కోరారు. ఇవాళ మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామంలో జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.