కృష్ణా: గుడివాడ మున్సిపల్ ఆఫీసులో రేపు ఉదయం 10 గంటలకు గుడివాడ మాస్టర్ ప్లాన్ రూపకల్పన విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. ఇందులో భాగంగా సీఆర్ డీఏ, ఆర్ వి ఇంజనీరింగ్ కన్సల్టెంట్ వారు ప్రజల భాగస్వామ్యంతో రూపొందించడానికి సలహాలు సూచనలు స్వీకరిస్తారని మున్సిపల్ కమిషనర్ మనోహర్ తెలిపారు. ఆసక్తిగల సంస్థలు, సంఘ సమూహ సభ్యులు, మేధావులు పాల్గొని సూచనలు ఇవ్వాలన్నారు.