KRNL: ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఆదోని మార్కెట్ యార్డ్‌కి గురువారం సెలవు ప్రకటించారు. యార్డు కమిషన్ ఏజెంట్లు, హమాలీల వినతిపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెక్రటరీ గోవిందు తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. యార్డు కార్యకలాపాలు 17న యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. మోదీ పర్యటనను విజయవంతం చేయాలని రైతులకు, అధికారులకు పిలుపునిచ్చారు.