టాలీవుడ్ నటుడు ప్రియదర్శి హీరోగా విజయేందర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మిత్రమండలి’. ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ.5 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా హిట్ అవ్వాలంటే కనీసం రూ.6 కోట్ల షేర్.. అంటే దాదాపు రూ.12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాలని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.