TG: ‘సామాజిక తెలంగాణ’ లక్ష్యంగా ‘జాగృతి జనం బాట’ పేరుతో కల్వకుంట్ల కవిత రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ యాత్రలో KCR ఫొటో లేకుండానే యాత్ర చేపట్టనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. యాత్రకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేసి కవిత మాట్లాడారు. ‘KCR నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాబట్టి, ఆ చెట్టు నీడ నాది కాదు’ అని వ్యాఖ్యానించారు.