GNTR: పెదకాకాని గ్రంథాలయంలో బుధవారం భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త డా. ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతి నిర్వహించారు. కలాం చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. భారత రక్షణ రంగంలో అణు, క్షిపణి సాంకేతికతలకు బాటలు వేసిన గొప్ప శాస్త్రవేత్త అని, ఆయన “మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా”గా గుర్తింపు పొందారన్నారు. యువతకు ఆయన ఆదర్శమని కొనియాడారు.