బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు, ఫొటోలు, వాయిస్‌ను అనుమతి లేకుండా పలు వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారని పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని అడ్డుకోవాలని, ఇకపై ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, గతంలో ఇదే విషయంలో నాగార్జున, ఐశ్యర్యరాయ్, అభిషేక్ బచ్చన్ కోర్టు మెట్లెక్కారు.