KMM: ఖమ్మం నుంచి ముదిగొండ వచ్చే రహదారి గుంతలమయంగా మారిపోయింది. BVR బంక్ ఎదురు గుంతలుగా ఉన్న రోడ్డు వల్ల ఇవాళ అటుగుండా వెళ్తున్న ఇటుక ట్రాక్టర్ ట్రక్కు బోల్తా పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ గంతులు వల్ల నిరంతరం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేపించాలని కోరారు.