KRNL: ఏపికు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయని, వెనుకబడిన రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని CPI, CPM, ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్లో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ప్రధాని మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ MODI GO BACK అంటూ నిరసన తెలిపారు. కరువు కాటకాలతో అల్లాడుతున్న రాయలసీమకు మోదీ ఏమీ చేశారో చెప్పాలని ప్రశ్నించారు.