KDP: బ్రహ్మంగారిమఠం మండలం డి.అగ్రహారం గ్రామంలో ఆర్సియం సంస్థకు నూతన రెవరెంట్ ఫాదర్‌గా ఎన్నికైన విద్యాసాగర్‌ను టీడీపీ మండల అధ్యక్షుడు చెన్నుపల్లె సుబ్బారెడ్డి, మండల యువనేత మల్లికార్జున రెడ్డిలు శాలువ కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… దేవుని సేవ చేయడం గొప్ప వరమని, సమాజంలో ఐక్యత అభివృద్ధికి కృషి చేయాలన్నారు.