ASR: దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్పులలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తచర్యలు తీసుకోవాలని ఎస్పీ అమిత్ బర్దార్ బుధవారం అధికారులను ఆదేశించారు. మందుగుండు సామగ్రి తయారీ, నిల్వ కేంద్రాలు, గోడౌన్లు, దుకాణాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బాణాసంచా విక్రయించేవారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు.