TG: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద రాంగ్ రూట్లో వచ్చిన ఓ టిప్పర్ లారీ.. స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.