NZB: బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 18న తలపెట్టిన తెలంగాణ బంద్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. జిల్లా కేంద్రంలోని పలు వ్యాపార సంస్థలు, మర్చంట్ అసోసియేషన్లకు బుధవారం వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పోరాటం న్యాయపోరాటమని, అన్ని వర్గాల వారు సహకరించాలని కోరారు.