KKD: కోటనందూరు మండలం టీజే నగరం వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా అదే గ్రామానికి చెందిన సుర్ల రాజు నియమితులయ్యారు. వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆదేశాలతో ఆ పార్టీ అధికార ప్రతినిధి లాలం బాజ్జీ బుధవారం కోటనందూరులో నిర్వహించిన సమావేశంలో రాజును అభ్యర్థిగా ప్రకటించారు. రాజు గెలుపునకు పార్టీ నాయకులు, కార్య కర్తలు అందరూ సహకరించాలని బాజ్జీ కోరారు.