KKD: జగ్గంపేటలోని ప్రభుత్వ మోడల్ ప్రైమరీ పాఠశాలలో మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు హాజరై కలాం చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలాం జీవితం అందరికీ ఆదర్శమన్నారు.