ఇస్రో చీఫ్ వి. నారాయనణ్ కీలక ప్రణాళికలను పంచుకున్నారు. భవిష్యత్తులో 80,000 కేజీల బరువును మోసుకెళ్లగలిగే భారీ రాకెట్లను తయారు చేయాలని అన్నారు. గగన్‌యాన్(మానవ సహిత యాత్ర) మిషన్ 2027లో విజయవంతంగా చేపట్టేందుకు ట్రాక్‌లో ఉందని వెల్లడించారు. అంతేకాక, 2040 నాటికి తొలి మానవ సహిత చంద్రుడి యాత్రను చేపట్టాలని PM మోదీ లక్ష్యాన్ని నిర్దేశించారని ఆయన పేర్కొన్నారు.