NZB: నేరరహిత కమిషనరేట్‌గా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి చేస్తానని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో చోరీలు జరిగితే రికవరీలు కష్టంగా ఉండేదన్నారు. దాడుల జరిగిన సంఘటనల్లో సైతం నిందితులను పట్టుకోవడం ఇబ్బందిగా మారేదని పేర్కొన్నారు. కాని ప్రస్తుతం పరిస్థితి మారిందని స్పష్టం చేశారు.