KDP: ఆరోగ్యమే మహాభాగ్యం అని బ్రహ్మంగారిమఠం మండల విద్యాశాఖ అధికారి పుల్లయ్య పేర్కొన్నారు. అంతర్జాతీయ చేతుల పరిశుభ్రతా దినోత్సవం (గ్లోబల్ హ్యాండ్ వాష్ డే) సందర్భంగా మండల కేంద్రంలోని బాలికల జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల విద్యార్థి, విద్యార్థినులకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం ఆర్కె మూర్తి పాల్గొన్నారు.